
తాళం వేసిన ఇంట్లో చోరీ
ముస్తాబాద్(సిరిసిల్ల): బంధువుల ఇంటికి శుభకార్యానికి ఇంటికి తాళం వేసి వెళ్లగా.. తిరిగి వచ్చే సరికి దొంగలు లూఠీ చేశారు. బంగారం, వెండి ఆభరణాలతోపాటు భారీగా నగదును దోచుకుపోయారు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లెకు చెందిన మడకుంట రాములు ఇంటిలో దొంగలు పడి రూ.50వేల నగదు, 2 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. రాములు బంధువుల ఇంటిలో జరిగిన శుభకార్యానికి భార్య పిల్లలతో కలిసి గత సోమవారం వెళ్లాడు. బుధవారం తిరిగి రాగా.. బీరువాలోని వస్తువులు చిందర వందర పడి ఉండడం గమనించాడు. బీరువాలోని రూ.50వేల నగదు, 2 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. ఇంటి వెనుకగల తలుపు నుంచి దొంగలు లోనికి ప్రవేశించినట్లు గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై గణేశ్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు.
కార్మికుడి ఇంట్లో చోరీ
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): స్థానిక సింగరేణి కార్మికుడు గడ్డం పరేశ్ నివాసం ఉంటున్న టీ2–592లో బుధవారం చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిఖనికి వెళ్లిన పరేశ్.. సాయంత్రం వచ్చిచూడగా ఇంటి తలుపు తీసి ఉంది. బీరువా తెరిచి ఉంది. అందులోని రెండు బంగారు గొలుసులు, రెండు కమ్మలు, ఒకరింగ్ కనిపించలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. తమకు ఫిర్యాదు అందలేదని సీఐ ప్రసాద్‌రావు తెలిపారు.
రూ.50వేలు నగదు, 2తులాల బంగారం అపహరణ

తాళం వేసిన ఇంట్లో చోరీ