
కిడ్నాప్ చేసి.. ప్రాణాలు తీసి
● వృద్ధురాలి మిస్సింగ్ కేసు ఛేదన
గంగాధర: గంగాధర పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలు హత్యకు గురైందని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. గంగాధరకు చెందిన పెగు డ మల్ల వ్వ(65)ను కారులో తీసుకెళ్లి రాజన్నసిరిసిల్ల జిల్లా శివారులో హత్య చేశారని, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సై కథనం ప్రకారం.. పెగుడ మల్లవ్వ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈనెల 16న కనిపించకుండా పోయింది. ఆమె బంధువు ఈరవేణి రాయమల్లు ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమో దు చేసుకున్న పోలీసులు ఏసీపీ విజయ్‌కుమార్, సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన దేవూరి సతీశ్, దేవునూరి శ్రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామానికి చెందిన గంగరాజు సూచనల మేరకు వృద్ధురాలిని కిడ్నాప్ చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట శివారులో హత్యచేసి, ఆభరణాలు దోచుకొని, శవాన్ని చెత్తకుప్పలో పడేసినట్లు వెల్లడించా రు. కేసులో ప్రధాన నిందితుడు గంగరాజుతోపాటు మరికొంత మంది పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు.
ఏడాదిన్నర కుమారుడితో తల్లి అదృశ్యం
మల్యాల: మండలకేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన అలకుంట పూజ తన ఏడాదిన్నర కుమారుడితో అదృశ్యమైంది. ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం..పూజకు రెండేళ్ల క్రితం కరీంనగర్ మండలం వడ్డపల్లి గ్రామానికి చెందిన అలకుంట చందూతో వివాహమైంది. భర్తతో మనస్పర్థలు ఏర్పడి కుమారుడు యశ్వంత్‌తో తల్లిగారిల్లయిన మల్యాలలో ఉంటోంది. మంగళవారం అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా కుమారుడితో ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

కిడ్నాప్ చేసి.. ప్రాణాలు తీసి