
హోంగార్డు, కానిస్టేబుల్‌పై దాడి
కోరుట్ల: డయల్ 100కు కాల్ రాగా.. సంఘటన స్థలానికి వెళ్లిన కానిస్టేబుల్ గంగాధర్, హోంగార్డు జహీద్‌పై షేక్ యాసిన్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో జహీద్, గంగాధర్‌కు గాయాలయ్యాయి. ఎస్సై కథనం ప్రకారం.. పట్టణంలోని తాళ్లచెరువు ప్రాంతంలో కొందరు వ్యక్తులు మంగళవారం రాత్రి మద్యంమత్తులో ఉండి అసభ్యకరంగా కేకలు వేస్తుండటంతో స్థానికులు 100కు డయల్ చేశారు. దీంతో బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు గంగాధర్, జహిద్ వెళ్లారు. న్యూసెన్స్ చేయొద్దని అక్కడ మద్యం సేవిస్తున్న వ్యక్తులతో చెబుతుండగా.. మహమ్మద్ యాసిన్ కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ గంగాధర్ పిర్యాదు మేరకు యాసిన్‌పై బుధవారం కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. అతనికి 14 రోజులు జుడీషియల్ రిమాండ్ విధించారని ఎస్సై తెలిపారు. యాసిన్‌పై గతంలో రెండు హత్యాప్రయత్నం కేసులు ఉన్నాయని, అతడిపై రౌడీషీట్ తెరుస్తామని పేర్కొన్నారు.
పాముకాటుతో కౌలు రైతు మృతి
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన మెడబోయిన రమేశ్(40) పాముకాటుతో మృతి చెందాడు. చిగురుమామిడి ఎస్సై సాయికృష్ణ వివరాల ప్రకారం.. రమేశ్ కౌలురైతు. రోజూవారి పనుల్లో భాగంగా బుధవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. చేనులో కూరగాయలు తెంపుతుండగా పాముకాటు వేసింది. కుటుంబసభ్యులు హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

హోంగార్డు, కానిస్టేబుల్‌పై దాడి