
అగ్ని ప్రమాదంతో రూ.1.67కోట్ల నష్టం
అగ్ని ప్రమాదం జరిగిన గోదాంను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడ చేపట్టిన చర్యల గురించి తెలుసుకున్నా రు. సాధ్యమైనంత తొందరంగా మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నించాలని అధికా రులకు సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, డీఎస్పీ రాములు, అర్డీఓ శ్రీనివా స్, సివిల్ సప్లయ్ శాఖ డీఎం జితేంద్రప్రసాద్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సైదులు, సీఐ అనిల్‌కుమార్, ఆయా శాఖల సిబ్బంది ఉన్నారు.
సివిల్ సప్లయ్ శాఖ గన్నీ సంచులను 2018లో ఈ గోదాంలో నిల్వ చేసింది. ఇందుకు గాను మార్కెటింగ్ శాఖకు ప్రతినెలా రూ.38వేలు చెల్లిస్తున్నట్లు తెలిసింది.
ఆ సంచులను ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా టెండర్ ద్వారా విక్రయించాలి. ఈ విషయంలో ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు.
తద్వారా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. ప్రమాదంలో సంచులన్నీ కాలి బూడిదై భారీ నష్టానికి దారి తీసింది.
గోదాంల భద్రత విషయంలో మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం చూపుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మార్కెట్ కార్యాలయానికి దూరంగా ఉన్న ఈ గోదాంల ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటు సిబ్బంది పర్యవేక్షణ కొరవడడంతో ప్రతిరోజు వాటి వద్ద బయటి వ్యక్తులు పేకా ట ఆడడం, మద్యం సేవించడం చేస్తున్నారు.
గోదాంలో విద్యుత్ సదుపాయం లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్‌కు అవకాశముండదు.
అక్కడ పేకాట, మద్యం సేవించే వ్యక్తుల్లో ఎవరైనా ఈ ప్రమాదం చోటు చేసుకునే చర్యలకు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గోదాంలో చెలరేగిన మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి పోలీస్, రెవెన్యూ, సివిల్, మార్కెటింగ్, అగ్నిమాపక శాఖల అధికారులు సోమవారం ఉదయం నుంచి అక్కడే ఉండి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఆ గోదాం పక్కనే మరో మూడు గోదాంలు ఉండడమే కాకుండా నివాస గృహాలు ఉన్నాయి.
మంటలు ఎగిసిపడినా.. వాటికి వ్యాపించకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
గోదాంకు మూడు వైపులా ఉన్న గోడకు పలు చోట్ల పెద్ద రంధ్రాలు చేశారు. అందులో నుంచి పెద్ద సంఖ్యలో సంచులను బయటవేసి మంటల ఉధృతిని కొంతమేర తగ్గించారు.
రాత్రివేళలో కూడా మంటలను ఆర్పేందుకు అక్కడ తగిన ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం వరకు పూర్తిగా ఆదుపులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
మెట్‌పల్లి: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గో దాంలో జరిగిన అగ్ని ప్రమాదంతో భారీ నష్టం సంభవించింది. ఈ గోదాంలో సివిల్ సప్లయ్ శాఖ గన్నీ సంచులను నిల్వ ఉంచిన సంగతి తెలిసిందే. ఆ శాఖకు చెందిన రూ.97లక్షల విలువైన 9,07, 527 పాత గన్నీ సంచులు దగ్ధమయ్యాయి. అలాగే మంటల ధాటికి 2వేల టన్నుల గోదాం ధ్వంసమైంది. దీనివల్ల రూ.70వేల నష్టం వాటిల్లినట్లు మార్కె ట్ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై ఇరు శాఖలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం పది గంటలకు చెలరేగిన మంటలు.. సోమవారం రాత్రి వరకు కూడా అదుపులోకి రాకపోవడం గమనార్హం.
టెండర్‌లో జాప్యం..భారీ నష్టం
● సివిల్ సప్లయ్ శాఖ గన్నీ సంచులను 2018లో ఈ గోదాంలో నిల్వ చేసింది. ఇందుకు గాను మార్కెటింగ్ శాఖకు ప్రతినెలా రూ.38వేలు చెల్లిస్తున్నట్లు తెలిసింది.
● ఆ సంచులను ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా టెండర్ ద్వారా విక్రయించాలి. ఈ విషయంలో ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు.
● తద్వారా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. ప్రమాదంలో సంచులన్నీ కాలి బూడిదై భారీ నష్టానికి దారి తీసింది.
భద్రతపై మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం
● గోదాంల భద్రత విషయంలో మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం చూపుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
● మార్కెట్ కార్యాలయానికి దూరంగా ఉన్న ఈ గోదాంల ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటు సిబ్బంది పర్యవేక్షణ కొరవడడంతో ప్రతిరోజు వాటి వద్ద బయటి వ్యక్తులు పేకా ట ఆడడం, మద్యం సేవించడం చేస్తున్నారు.
● గోదాంలో విద్యుత్ సదుపాయం లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్‌కు అవకాశముండదు.
● అక్కడ పేకాట, మద్యం సేవించే వ్యక్తుల్లో ఎవరైనా ఈ ప్రమాదం చోటు చేసుకునే చర్యలకు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రమిస్తున్న ఐదు శాఖల అధికారులు
● గోదాంలో చెలరేగిన మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి పోలీస్, రెవెన్యూ, సివిల్, మార్కెటింగ్, అగ్నిమాపక శాఖల అధికారులు సోమవారం ఉదయం నుంచి అక్కడే ఉండి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
● ఆ గోదాం పక్కనే మరో మూడు గోదాంలు ఉండడమే కాకుండా నివాస గృహాలు ఉన్నాయి.
● మంటలు ఎగిసిపడినా.. వాటికి వ్యాపించకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
● గోదాంకు మూడు వైపులా ఉన్న గోడకు పలు చోట్ల పెద్ద రంధ్రాలు చేశారు. అందులో నుంచి పెద్ద సంఖ్యలో సంచులను బయటవేసి మంటల ఉధృతిని కొంతమేర తగ్గించారు.
● రాత్రివేళలో కూడా మంటలను ఆర్పేందుకు అక్కడ తగిన ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం వరకు పూర్తిగా ఆదుపులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
రెండోరోజూ అదుపులోకి రాని మంటలు
పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్
పరిశీలించిన కలెక్టర్
అగ్ని ప్రమాదం జరిగిన గోదాంను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడ చేపట్టిన చర్యల గురించి తెలుసుకున్నా రు. సాధ్యమైనంత తొందరంగా మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నించాలని అధికా రులకు సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, డీఎస్పీ రాములు, అర్డీఓ శ్రీనివా స్, సివిల్ సప్లయ్ శాఖ డీఎం జితేంద్రప్రసాద్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సైదులు, సీఐ అనిల్‌కుమార్, ఆయా శాఖల సిబ్బంది ఉన్నారు.

అగ్ని ప్రమాదంతో రూ.1.67కోట్ల నష్టం