
కాజీపేట – బల్హార్ష రైలుకు ఆదరణ కరువు
రామగుండం: కాజీపేట – బల్హర్ష మధ్య నడిచే బల్హర్ష ఎక్స్‌ప్రెస్ రైలు అర్ధరాత్రి ప్రారంభమవుతోంది. వేకువజామున గమ్యస్థానం చేరుకుంటోంది. దీంతో ప్రయాణికులు లేక బోగీలు బోసిపోయి కనినిపస్తున్నాయి. కాజీపేటలో రాత్రి 10.50 గంలకు ప్రారంభమైతే.. ఉప్పల్‌కు రాత్రి 11.09 గంటలకు, జమ్మికుంటకు రాత్రి 11.18 గంటలకు, ఓదెలకు రాత్రి గం.11.32 గంటలకు, పెద్దపల్లికి రాత్రి 11.41గంటలకు, రాఘవాపురానికి రాత్రి 11.47 గంటలకు, రామగుండానికి రాత్రి 11.54గంటలకు, బల్హర్షకు వేకువజామున 3.10గంటలకు చేరుకుంటోంది. తిరుగు ప్రయాణంలో బల్హార్షలో వేకువజామున 3.50గంటలకు ప్రారంభమై రామగుండానికి ఉదయం 5.47గంటలకు, పెద్దపల్లికి ఉదయం 6.15 గంటలకు, ఓదెలకు ఉదయం 6.34లకు, జమ్మికుంటకు ఉదయం 7.20గంటలకు కాజీపేటకు ఉదయం 8.50 గంటలకు చేరుకుంటోంది. దీనికి అర్ధగంట ముందే భాగ్యనగర్ నడవడంతో హైదరాబాద్ మార్గంలో ప్రయాణించేవారంతా అందులోనే వెళ్తున్నారు. దీంతో బల్హర్ష రైలుకు ప్రయాణికుల నుంచి ఆదరణ ఉండడంలేదు. మరోవైపు.. అర్ధరాత్రివేళ రాకపోకలు సాగించే ఈ రైలులో ప్రయాణించే కొద్దిమంది మహిళా ప్రయాణికులకు కూడా భద్రత కరువైంది. వారిరక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది.
రాత్రివేళలోనే ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
వేకువజామున గమ్యస్థానం చేరిక
పదిమంది కూడా ప్రయాణించని వైనం
తిరుగు ప్రయాణంలోనూ స్పందన కరువు
రాకపోకల సమయాలు మార్చాలని డిమాండ్
సికింద్రాబాద్ వరకు పొడిగించాలని విన్నపాలు