
గుండెపోటుతో తహసీల్దార్ మృతి
జగిత్యాలక్రైం: మంచిర్యాల జిల్లా నెన్నెల తహసీల్దార్.. జగిత్యాలలోని మిషన్‌కాంపౌండ్ ప్రాంతానికి చెందిన ముద్దమల్ల జ్యోతి బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. ఆమె అంత్యక్రియల్లో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, పెద్దపల్లి ఆర్డీవో గంగన్న, తహసీల్దార్లు వెంకటకిషన్, జగిత్యాల రూరల్, అర్బన్ తహసీల్దార్లు శ్రీనివాస్, రాంమోహన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రవిబాబు, ఏవో హకీం, మూడు జిల్లాల రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణ శివారు రంగంపల్లి ప్రాంతంలో బుధవారం తెల్లవారు జాము న గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో గుర్తుతెలియని (సుమారు 35నుంచి 40 ఏళ్ల మధ్య వయసు) వ్యక్తి మృతిచెందాడు. మృతుడి కుడివైపు చాతీపై పచ్చబొట్టుతో త్రిశూలం, ఢమరుకం ఉందని ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. ఎడమ భుజంపై త్రిశూలం, కుడిచేతిపై గిటార్, కత్తి, పూలతో కూడిన పచ్చబొట్లు ఉన్నా యని వివరించారు. నలుపురంగు ఫుల్ డ్రాయ ర్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. మృతదేహా న్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపర్చినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 87126 56506, 87126 56505 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు .
బైక్ అదుపుతప్పి యువకుడు..
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన గిరబోయిన అజయ్(22) ద్విచక్ర వాహనం అదుపుతప్పి మృతి చెందాడు. గ్రా మస్తులు, బంధువుల వివరాల ప్రకారం.. అజయ్ బుధవారం ద్విచక్రవాహనంపై నవాబుపేట్ నుంచి ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యలో సుందరగిరిలోని రాజ్యాంగ స్తూపస్తంభం వద్ద బైక్ అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు. అజయ్ రవళి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది, నాలుగు నెలల ఇద్దరు కూతుళ్లున్నారు. అజయ్ తల్లిదండ్రులు స్వరూప, సంపత్ గతంలోనే చనిపోయారు. పేద కుటుంబానికి చెందిన అజయ్‌కి ఇల్లు కూడా లేదు.
తిప్పన్నపేటలో మరొకరు..
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామ శివారులో జగిత్యాల–ధర్మపురి ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనగా గుంటి రాజేందర్ అనే వ్యక్తికి తీవ్రగాయాలై మృతి చెందాడు. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన గుంటి రాజేందర్ బుధవారం సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై తిప్పన్నపేటకు వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో రాజేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు రాజేందర్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మరణించాడు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
జ్వరంతో యువకుడు..
మంథనిరూరల్: మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన దేవళ్ల వెంకటేశ్(17) జ్వరంతో మృతి చెందాడు. రెండురోజుల క్రితం వెంకటేశ్‌కు జ్వరం రాగా స్థానికంగా చికిత్స చేయించుకున్నా తగ్గకలేదు. దీంతో గోదావరిఖనికి అక్కడి నుంచి కరీంనగర్‌లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. వెంకటేశ్ మంథని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

గుండెపోటుతో తహసీల్దార్ మృతి