‘నలిమెల’కు కాళోజీ పురస్కారం
సిరిసిల్లకల్చరల్/కరీంనగర్‌కల్చరల్: ఉమ్మడి జిల్లాకు చెందిన బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్‌కు ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం వరించింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌ల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. పద్నాలుగు భాషలపై పట్టు సాధించడంతో పాటు అనువాద రచయితగా లబ్ధప్రతిష్టుడైన నలిమెలకు స్మారక శిలలు అనువాద రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందించింది. నలిమెలను జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఎలగొండ రవి, బూర దేవానందం, మానేరు రచయితల సంఘం ప్రతినిధులు డాక్టర్ పత్తిపాక మోహన్, ఆడెపు లక్ష్మన్, జూకంటి జగన్నాథం, చిటికెన కిరణ్, టీవీ నారాయణ, సిరిసిల్ల సాహితీ సమితి ప్రతినిధులు డాక్టర్ జనపాల శంకరయ్య, వెంగల లక్ష్మణ్ తదితరులు అభినందనలు తెలిపారు.


