హామీ ఇచ్చి.. అమలు చేసి..
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం చేగుర్తి సర్పంచ్ బాషవేణి సరోజన సోమవారం ఆరుగురు పంచాయతీ సిబ్బంది నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రతీనెల వారికి నిత్యావసరాలు పంపిణీ చేసే పథకాన్ని ప్రారంభించారు. వారి కుటుంబాలకు ఐదేళ్లపా సరిపడే కిరాణా సామగ్రిని ప్రతీనెల అందిస్తామన్నారు. అంతేకాదు.. ఆడపిల్ల జన్మిస్తే రూ.5,116 విలువైన పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ బహుమతి అందిస్తామని సర్పంచ్ సరోజన–మల్లేశం దంపతులు వెల్లడించారు.
ఆడపిల్లకు రూ.5,116
కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్ సర్పంచ్ కూర నరేశ్‌రెడ్డి, జూబ్లీనగర్ సర్పంచ్ సుద్దాల కమలాకర్ మాట్లాడుతూ.. ఇకనుంచి తమ ఊళ్లలో జన్మించే ఆడపిల్ల పేరిట రూ.5,116 డిపాజిట్ చేస్తామన్నారు. నగునూరు సర్పంచ్ సాయిల్ల శ్రావణి.. ఎస్సెస్సీలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందిస్తామని ప్రకటించారు.
ప్రమాణ స్వీకారం రోజే..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ సర్పంచ్ పూర్మాని రాజశేఖర్‌రెడ్డి.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రమాణ స్వీకారం రోజే అమలు చేశారు. తాను సర్పంచ్‌గా గెలిచాక గ్రామంలో ఆడబిడ్డ పుడితే రూ.5వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్, పెళ్లికి రూ.5వేలు నగదు కానుకగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈఏడాది గ్రామంలో జన్మించిన 9 మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున రూ.45 వేలు పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారు.
రూపాయికే 20 లీటర్ల మినరల్‌వాటర్..
బోయినపల్లి(చొప్పదండి): విలాసాగర్ సర్పంచ్ ఏనుగుల కనుయ్య.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూలపల్లి రామారావు కుటుంబంలో జన్మించిన ఆడపిల్లకు రూ.5వేలు విలువైన చెక్కు అందించారు. పంచాయతీ పాలకవర్గంతో కలిసి రూపాయికే 20 లీటర్ల ప్యూరిఫైడ్ వారట్ పథకం ప్రారంభించారు.
పాలనా పగ్గాలు చేపట్టేందుకు కొందరు అనేక వాగ్దానాలు చేస్తారు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మరికొందరు హామీలు ఇస్తారు.. ఇంకొందరు నగదు, విలువైన బహుమతులు అందిస్తారు.. గద్దెనెక్కాక చాలామంది మాటతప్పుతారు.. కానీ, ఈసారి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు మాటిచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు.. పదవీ ప్రమాణం స్వీకరించిన సోమవారం రోజే హామీలు అమలు చేసి ‘ప్రజాప్రతినిధి’ గౌరవం పెంచారు. ఉమ్మడి జిల్లాలోని ఇలాంటి కొందరిపై కథనం..
పాలనా పగ్గాలు చేపట్టేందుకు కొందరు అనేక వాగ్ధానాలు చేస్తారు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మరికొందరు హామీలు ఇస్తారు.. ఇంకొందరు నగదు, విలువైన బహుమతులు అందిస్తారు.. గద్దెనెక్కాక చాలామంది మాటతప్పుతారు.. కానీ, ఈసారి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు మాటిచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు.. పదవీ ప్రమాణం స్వీకరించిన సోమవారం రోజే హామీలు అమలు చేసి ‘ప్రజాప్రతినిధి’ గౌరవం పెంచారు. ఉమ్మడి జిల్లాలోని ఇలాంటి కొందరిపై కథనం ఇది..
ఆదర్శంగా నిలిచిన సర్పంచులు
ప్రమాణం చేసినరోజే అమలు
హామీ ఇచ్చి.. అమలు చేసి..


