తాళం వేసిన నాలుగిళ్లలో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం బాలపల్లిలో ఆదివారం రాత్రి తాళం వేసిన నాలుగిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన పడిగెల లచ్చవ్వ ఇంటికి తాళం వేసి కూతురు వద్దకు వెళ్లింది. ఎనగందుల జయలక్ష్మీ, బుర్ర రమ, గాలిపల్లి కవిత తమతమ ఇళ్లకు తాళాలు వేసి హైదరాబాద్ వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇళ్ల తాళాలు పగులగొట్టి బుర్ర రమ ఇంట్లోనుంచి రెండు బంగారు ఉంగరాలు, పడిగెల లచ్చవ్వ ఇంట్లోనుంచి వెండి విగ్రహాలు ఎత్తుకెళ్లారు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
బంగారు ఉంగరాలు, నగదు చోరీ


