రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సుల్తానాబాద్‌రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల(కోమండ్లపల్లి)కి చెందిన ఐలవేణి వెంకటేశ్(28) ఆదివారం రాత్రి ద్విచక్రవాహనం పైనుంచి పడి మృతిచెందాడు. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. వెంకటేశ్ ద్విచక్రవాహనంపై నీరుకుల్ల రంగనాయకస్వామి ఆలయం వైపు వెళ్లారు. పనిముగించుకుని రాత్రి ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో రంగంపల్లి వద్ద వద్ద ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి పడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య తులసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై తెలిపారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే విజయరమణరావు పరామర్శించారు.
వేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తురాలు చీకట్ల సమ్మక్క సోమవారం తప్పిపోయినట్లు టౌన్ సీఐ వరప్రసాద్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం ములుగుపల్లికి చెందిన సమ్మక్కగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎవరికై నా కనిపిస్తే 81064 79146, 83319 40691లో సమాచారం ఇవ్వాలని కోరారు.
ఒంటరైన చిన్నారి
● నాడు తల్లి... నేడు తండ్రి మృతి
కోనరావుపేట(వేములవాడ): నాడు తల్లి.. నేడు తండ్రి మృతి చెందడంతో చిన్నారి అనాథగా మారింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన మారు అంజిరెడ్డి(65) భార్య మల్లవ్వ అనారోగ్యంతో బాధపడుతూ మూడేళ్ల క్రితం మృతి చెందింది. తండ్రి అంజిరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందాడు. దీంతో వారి కూతురు నైనిక ఒంటరిగా మారింది. బాధిత కుటుంబాన్ని సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి పరామర్శించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


