టెంట్ కిందనే..
ఇల్లంతకుంట: మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో రెండేళ్లుగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని ఓ గదిలో పంచాయతీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సోమవారం పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవాన్ని టెంట్ కింద నిర్వహించారు. చిక్కుడువానిపల్లె, కృష్ణరావుపల్లి గ్రామాల్లోనే ఇదే పరిస్థితి. బోటుమీదిపల్లెలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో కుర్చీలు వేసి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. తాళ్లల్లపల్లిలో పంచాయతీ భవనం కోసం కేటాయించిన స్థలంలో కార్యక్రమం నిర్వహించారు.


