మీకు సిబిల్ ఉందా?
కరీంనగర్ కార్పొరేషన్: రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్)ను ముడిపెట్టడం కలకలం రేపుతోంది. ఓ వైపు మంత్రులు యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ ప్రామాణికం కాదని చెబుతున్నా, అధికారులు మాత్రం సిబిల్ స్కోర్ లెక్కలు తీస్తున్నారు. కరీంనగర్ నగరపాలకసంస్థ పరిధిలో 16,595 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా, చాలా మందికి సిబిల్ స్కోర్ అడ్డంకిగా మారుతోంది.
16,595 దరఖాస్తులు
నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో భాగంగా సబ్సిడీతో కూడిన రుణ మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. నగరపాలకసంస్థ పరిధిలో 16,595మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈడబ్ల్యూసీకి చెందినవారు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వారందరి సర్టిఫికెట్ల పరిశీలన సైతం నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలోని కళాభారతిలో ఇటీవల పూర్తి చేశారు. లబ్ధిదారుల ఎంపిక నేపథ్యంలో సిబిల్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకోవాలనే అధికారుల నిర్ణయంతో దరఖాస్తుల్లో ఆందోళన మొదలైంది.
దరఖాస్తుదారుల్లో గుబులు
రాజీవ్ యువవికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో సిబిల్ స్కోర్ ప్రామాణికంగా తీసుకోనుండడం దరఖాస్తుదారుల్లో గుబులు రేపుతోంది. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు నాలుగు కేటగిరీలవారిగా యూనిట్లను నిర్ణయించగా, సబ్సిడీ 70శాతం నుంచి 100 శాతం వరకు ఉంది. దీంతో చాలా మంది నిరుపేద, మధ్యతరగతి నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి సిబిల్ స్కోర్ ముడిపెట్టడంతో చాలా మంది అర్హుల జాబితాలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బ్యాంక్ రుణాలు, చెల్లింపులు, లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆరితేరిన వారికి సిబిల్ స్కోర్ గురించి అవగాహన అధికంగా ఉంటుంది. గతంలో రుణాలు తీసుకొని ఆలస్యంగా చెల్లించినా సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుంది. గతంలో లేని విధంగా ప్రభుత్వ పథకానికి సిబిల్‌స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకోవడంపై దరఖాస్తుదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే దరఖాస్తుదారుల జాబితాను ఆయా బ్యాంక్‌ల బ్రాంచ్‌లకు పంపించిన బల్దియా అధికారులు, బ్యాంక్‌ల నుంచి సిబిల్ స్కోర్ తెప్పించుకొంటున్నారు. ఇప్పటికే మెజార్టీ దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ నగరపాలకసంస్థకు చేరింది. వందశాతం వచ్చాక జాబితాను ప్రదర్శించే అవకాశం ఉంది.
కమిటీ నిర్ణయమే ఫైనల్
రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక కోసం ఉన్నతస్థాయిలో కమిటీ ఏర్పాటైంది. కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉండే ఈ కమిటీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగరపాలకసంస్థ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, బ్యాంక్ అధికారి, ఆయా దరఖాస్తుల కేటగిరీ వారిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అధికారులు సభ్యులుగా ఉండనున్నట్లు సమాచారం. సిబిల్ స్కోర్ ఆధారంగా, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితర కేటగిరీల వారిని ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రెండు, మూడు రోజుల్లో నగరంలో లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఏదేమైనా తమ అర్హతను సిబిల్ స్కోర్ దెబ్బతీసే అవకాశం ఉండడంతో దరఖాస్తుదారులుఆందోళన చెందుతున్నారు. సిబిల్ స్కోర్‌పై పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
ఈబీసీ
ఎస్టీ
సిబిల్ స్కోర్ ఉంటేనే రాజీవ్ యువ వికాస పథకానికి అర్హత
ఈ నిబంధనతో అనర్హులు భారీగా పెరిగే అవకాశం
బల్దియా అధికారుల తీరుతో దరఖాస్తుదారుల్లో గుబులు
క్రిస్టియన్
మైనార్టీ
674
దివ్యాంగులు
71
475
8,376
బీసీ
3,346
బల్దియాలో యువవికాసానికి వచ్చిన
దరఖాస్తులు
16,595
మైనార్టీ
376
ఎస్సీ
3,277
యూనిట్ సబ్సిడీ
రూ.50,000 100 శాతం
రూ.50,001 నుంచి రూ.లక్ష వరకు 90 శాతం
రూ.1,00,001 నుంచి రూ.2లక్షల వరకు 80 శాతం
రూ.2,00,001 నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం
మీకు సిబిల్ ఉందా?
మీకు సిబిల్ ఉందా?


