దేశ రక్షణ నిధికి ఎమ్మెల్యే నెల వేతనం విరాళం
సప్తగిరికాలనీ(కరీంనగర్): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలు పుమేరకు దేశ రక్షణ నిధికి ఒకనెల వేతనాన్ని అందజేశారు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సరిహద్దులో పాకిస్థాన్ ముష్కరులను తరిమి కొట్టిన భారత ఆర్మీవీరులకు సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. దేశ ప్రజలు గర్వించే విజయాలను అందిస్తున్న భారత సైన్యానికి పూర్తి సంఘీభావం తెలుపుతూ, తన కర్తవ్యంగా దేశ రక్షణనిధికి ప్రజాప్రతినిధులు ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేయాలని సీఎం పిలుపుమేరకు విరాళం అందజేసినట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమకు తోచిన విధంగా విరాళం అందజేయాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షిద్దాం
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదును పెంచాలని వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పీఆర్టీయూ టీఎస్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో పదోతరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించిన 116పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల టాపర్లుగా నిలిచిన 50మంది విద్యార్థులకు శనివారం కలెక్టరేట్‌లో ప్రతిభా పురస్కారాలు, అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అత్యున్నత బోధన అందుతుందని తెలిపారు. డీఈవో జనార్దన్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే పదోతరగతి ఫలితాల్లో 97.9శాతం ఉత్తీర్ణతతో జిల్లా ఆరోస్థానం నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుండు లక్ష్మణ్, దామోదర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఐలేని కరుణాకర్‌రెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సురేశ్, శంకర్ పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
దేశ రక్షణ నిధికి ఎమ్మెల్యే నెల వేతనం విరాళం


