ఎండ.. అప్రమత్తతే అండ!
● పెరుగుతున్న ఎండలు ● అప్రమత్తత అవసరం అంటున్న నిపుణులు
కరీంనగర్ అర్బన్: భానుడి ప్రతాపానికి సకలవర్గాలు సతమతమవుతున్నాయి. మానవులతో పాటు జంతువులు, పంటలకు ప్రతికూల పరిస్థితి నెలకొంటోంది. జిల్లాలో ఇప్పటికే పలువురు వడదెబ్బతో మరణించారు. గురువారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేమిటి అనే అంశాలు వివరించారు.
ఉదయం, సాయంత్రం నీరు పెట్టాలి
ఉష్ణోగ్రతలు హెచ్చరికస్థాయికి చేరినందున రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కూరగాయల తోటలకు ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే నీరు కట్టాలి. షెడ్‌నెట్ వేసుకుంటే మంచిది. పండ్ల తోటలకు పెద్దగా ఇబ్బంది లేదు. తీగజాతి కూరగాయలు, ఆకు కూరలకు ఉదయం, సాయంత్రం వేళలో నీటిని అందించాలి. ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకు నీటిని ఇవ్వకూడదు.
– ఆర్.శ్రీనివాస్‌రావు,
జిల్లా పట్టుపరిశ్రమ, ఉద్యానశాఖ అధికారి
గర్భిణులు, వృద్ధులు జాగ్రత్త
వేసవిలో గర్భిణులు జాగ్రత్త తీసుకోవాలి. శరీరం డిహైడ్రేషన్ కాకుండా ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లొద్దు. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడొద్దు. కీరదోస, పుచ్చకాయ లాంటి తాజా పండ్లు తీసుకోవాలి. వదులైనా కాటన్ దుస్తులను ధరించాలి. లవణాలతో కూడిన నీటిని అధికంగా తీసుకోవాలి. ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉంచుకోవాలి. బయటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తాగునీరు తీసుకెళ్లాలి. ప్రతీ 30నిమిషాలకు నీరు తాగుతూ ఉండాలి.
– సాయిని నరేందర్, ఎండీ పల్మనాలజిస్ట్
ఎండ.. అప్రమత్తతే అండ!
ఎండ.. అప్రమత్తతే అండ!


