‘ఫోన్‌ఇన్’ సమస్యలు పరిష్కరిస్తాం
కొత్తపల్లి: ఫోన్‌ఇన్ కార్యక్రమంలో వినియోగదారులు తెలిపిన విద్యుత్ సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు తెలిపారు. కరీంనగర్ విద్యుత్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన ‘ఫోన్ ఇన్’ కార్యక్రమానికి స్పందన లభించింది. కరీంనగర్ టౌన్, కరీంనగర్ రూరల్, హుజూరాబాద్ డివిజన్ల నుంచి మొత్తం 24 ఫోన్‌కాల్స్ వచ్చాయి. విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని ఎస్‌ఈ పేర్కొన్నారు. డీఈటీ కె.ఉపేందర్, డీఈ రాజం, ఎం.తిరుపతి, ఎస్‌ఏఓ రాజేంద్రప్రసాద్, ఏడీఈలు పాల్గొన్నారు.
విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి
కరీంనగర్‌సిటీ: విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరో హించాలని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వరలక్ష్మి సూచించారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థినులు ఎంచుకున్న రంగాల్లో ముందుకు సాగాలన్నారు. క్రమశిక్షణతో అనందమైన జీవితాన్ని కొనసాగించాలన్నారు. అధ్యాపకులు శ్రీనివాస్‌రెడ్డి, రజినిదేవి, లక్ష్మణరావు, అనంతలక్ష్మి, స్రవంతి, మొగిలి, కల్పన పాల్గొన్నారు.
‘ఫోన్‌ఇన్’ సమస్యలు పరిష్కరిస్తాం


