కారును ఢీకొన్న లారీ.. 9 మందికి గాయాలు
జగిత్యాలక్రైం: దైవ దర్శనానికి వచ్చిన భక్తులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఘటన ఆదివారం జగిత్యాల రూరల్ మండలంలో జరిగింది. స్థాని కుల వివరాలు.. నిర్మల్ జిల్లా దివాల్‌పూర్‌కు చెందిన కడెం శ్రీరాం, ల్యాండ్రి మున్నా, దన్నూరి ప్రణీత్, కారెపు రుషి, కడెం విశ్వంత్, భూమేశ్, రిషికరుణ్, నిమ్మల నర్సయ్య, కారే మధు ఆదివారం కొండగట్టు దైవదర్శనానికి వచ్చారు. అక్కడి నుంచి ధర్మపురి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీ, కారును ఢీకొనడంతో కారులోని 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా, కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. రూరల్ ఎస్‌ఐ సదాకర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
కారును ఢీకొన్న లారీ.. 9 మందికి గాయాలు


