
పెద్దంపేటలో ఈతవనం దహనం
రామగుండం: అంతర్గాం మండలం పెద్దంపేట గ్రా మ శివారు అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి గు ర్తు తెలియని వ్యక్తులు ఈతవనం తగులబెట్టారు. ఈ ఘటనలో సుమారు 600 చెట్లు కాలిబూడిదయ్యాయని గీత కార్మిక సంఘం ప్రతినిధులు మేర్గు రమేశ్‌గౌడ్, బండి మహేశ్‌గౌడ్ తెలిపారు. సమాచారం అందుకున్న ఎకై ్సజ్ శాఖ సీఐ మంగమ్మ, ఎస్సై శ్రీనివాస్ శుక్రవారం తమ సిబ్బందితో క్షేత్ర స్థాయిలో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చెట్లు కాలిపోవడంతో గీత కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్ర భావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
ఈతవనం దగ్ధం
మేడిపల్లి(వేములవాడ): భీమారం మండలంలో వరుస ప్రమాదాలతో గౌడన్నల జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాలుగు నెలల క్రితం కమ్మరిపేటలో నిప్పంటుకొని ఈతవనం దగ్ధమైంది. 15 రోజుల క్రితం దేశాయిపేటలో 5 వేల ఈతచెట్లు అగ్నికి ఆహుతైనాయి. శుక్రవారం బీమారం మండల కేంద్రంలో గౌడ కులస్తులకు చెందిన ఐదెకరాల భూమిలో 3,000 ఈతచెట్లు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి. వరుస ఘటనలతో గీత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. అందుబాటులో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
గుర్తుతెలియని వ్యక్తుల దుశ్చర్య
కాలిబూడిదైన 600 చెట్లు

పెద్దంపేటలో ఈతవనం దహనం