‘ఎలనాగ’కు కేంద్ర సాహిత్య అవార్డు | - | Sakshi
Sakshi News home page

‘ఎలనాగ’కు కేంద్ర సాహిత్య అవార్డు

Mar 12 2024 8:05 AM | Updated on Mar 12 2024 8:05 AM

గాలిబ్‌–నాటి కాలం పుస్తకం 
 - Sakshi

గాలిబ్‌–నాటి కాలం పుస్తకం

కరీంనగర్‌కల్చరల్‌: జిల్లాలోని ఎలగందుల గ్రామనికి చెందిన కవి ఎలనాగ 2017లో అనువదించిన గాలిబ్‌– నాటి కాలం పుస్తకం అనువాద సాహిత్య విభాగంలో 2023 గానూ కేంద్ర సాహిత్య అవార్డుకు ఎంపికై ంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రముఖ కవి పవన్‌ కె.వర్మ రచించిన గాలిబ్‌ ద మ్యాన్‌, ద టైమ్‌ పుస్తకాన్ని గాలిబ్‌– నాటి కాలం పేరుతో అనువదించారు. 1953లో పుట్టిన ఎలనాగ వృత్తిరీత్యా డాక్టరైనా ప్రవృత్తి రీత్యా కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు. 1980 నుంచి 1986 వరకు నైజీరియాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో, తర్వాత 1989 నుంచి 2012 వరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధానపరిషత్‌లో పని చేసి, రాష్ట్రస్థాయి అధికారిగా ఉద్యోగ విరమణ పొందారు.

హైస్కూల్‌ నుంచే..

ఎలనాగ హైస్కూల్‌ నుంచే రచనలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు రాసిన మొదటి కవిత, కరీంనగర్‌ నుంచి వెలువడిన గౌతమి పత్రికలో ప్రచురితమైంది. ఎలనాగ మెడిసిన్‌ చదువుతున్న కాలంలో భారతి, కృష్ణా పత్రిక, స్రవంతి, ఆంధ్రప్రభ, తరుణ, పొలికేక, విపుల తదితర పత్రికల్లో అతడి రచనలు ప్రచురితమయ్యాయి. సోమర్సెట్‌ మామ్‌ రచన అయిన శ్రీది ఏలియెన్‌ కార్న్‌శ్రీ అనే నవలకు వీరు చే సిన తెలుగు అనువాదం కలుపుమొక్క శీర్షికతో 200 5లో అచ్చయింది. 2005 వరకు చేసిన రచనలన్నీ నాగరాజు సురేంద్ర పేరుతో వచ్చాయి. తర్వాత ఎలనాగ అన్న కలంపేరు పెట్టుకున్నారు. 2009లో మొ దటి కవితా సంపుటి వాగంకురాలు వెలువడింది.

వెలువరించిన పుస్తకాలు

● కలుపు మొక్క, వాగంకురాలు వచన కవితా సంపుటి (2009).

● పెన్మంటలు, కోకిలమ్మ పదాలు: గేయ సంపుటి (2009).

● సజల నయనాల కోసం వచన కవితా, ప్రయోగ పద్యాల సంపుటి (2010)

● అంతర్లయ: వచన కవితా సంపుటి (2012).

● అంతస్తాపము: ఛందోబద్ధ పద్యాల సంపుటి (2012)

● ఉత్తమ లాటిన్‌ అమెరికన్‌ కథలు: అనువాద కథల సంపుటి (2013)

● పొరుగు వెన్నెల, భాషాసవ్యతకు బాటలు వేద్దాం: దీర్ఘ వ్యాసం (2014)

● అంతర గాంధారం: వచన కవితా సంపుటి (2015).

● అంతర్నాదం: వచన కవితా సంపుటి (2015).

● సోమర్సెట్‌ మామ్‌ కథలు: అనువాద కథల సంపుటి.

● కొత్త బాణి: ప్రయోగ పద్యాల సంపుటి (2016).

● ఊహల వాహిని: భారతీయ భాషల కవితలకు తెలుగు అనువాదం (2017).

● కథాతోరణం: వివిధ దేశాల భాషల కథలకు తెలుగు అనువాదం (2017).

● నుడిక్రీడ: ప్రామాణిక తెలుగు గళ్ల నుడికట్ల సంపుటి (2017)లతో 37 పుస్తకాలను రచించారు.

పురస్కారాలు:

సోమసుందర్‌ పురస్కారం, అద్దేపల్లి పురస్కారం, జింకా నాగరాజు పురస్కారం (అనువాదాలకు), తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం (అనువాదాలకు), విశ్వసాహితి వారి పురస్కారం, ఆచార్య చెన్నకేశవరెడ్డి, పురస్కారం, గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం.

ఆరో కవి..

గతంలో కవిత్వంలో సి.నారాయణరెడ్డి, బాల సాహిత్యంలో వాసాల నర్సయ్య, పత్తిపాక మోహన్‌, అనువాద సాహిత్య నలిమెల భాస్కర్‌, వారాల ఆనంద్‌కు కేంద్ర సాహిత్య అవార్డులు వరించాయి. కేంద్ర సాహిత్య అవార్డు వచ్చిన ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన ఆరో కవిగా ఎలనాగకు గుర్తింపు వచ్చింది. అనువాదంలో మూడో కవిగా నిలిచారు.

అనువాద రచన ‘గాలిబ్‌– నాటి కాలం’ పుస్తకానికి వరించిన పురస్కారం

ఎలనాగ 
1
1/1

ఎలనాగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement