యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): గోదావరిఖని తిలక్ నగర్‌కు చెందిన ఎండీ.అజీముద్దీన్ అనే యు వకుడు గోదావరి నదిలో దూకగా గల్లంతయ్యాడు. టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. అజీముద్దీన్ మంగళవారం మధ్యాహ్నం గోదావరి బ్రిడ్జి వద్ద కు బైక్ వచ్చాడు. వంతెన పైనుంచి నదిలో దూకిన ట్లు డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సీఐ అఫ్జలొద్దీన్, ఎస్సై మధుసూదన్ జాలర్ల సహాయంతో గాలి ంచినా అజీముద్దీన్ ఆచూకీ లభించలేదు. కాగా, అతను కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
గాలించినా లభించని ఆచూకీ