
గిరిజన తండాలో పుట్టి.. కోచ్‌గా ఎదిగి
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం బంజేరుపల్లి లంబాడతండా (బి) గ్రామానికి చెందిన ఇస్లావత్ నరేశ్‌నాయక్ చిన్ననాటి నుంచే ఖోఖో ఆటపై మక్కువ పెంచుకున్నాడు. తండాకు చెందిన ఇస్లావత్ రూపానాయక్– సంతారికి శ్రీనివాస్, నరేశ్ సంతానం. శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నరేశ్ 1996లో ఇంటర్ చదువు కోసం హుస్నాబాద్ గురుకులంలో చేరాడు. అప్పుడు జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని ప్రథమస్థానంలో నిలిచాడు. పంజాబ్, మహారాష్ట్ర, హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటాడు. 2015లో కోచ్‌గా మారారు. 2006లో స్పోర్స్ కోటాలో రైల్వేలో మెకానిక్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని లాలాగూడలో చీఫ్ మర్క్‌షాప్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని జరిగిన ప్రపంచకప్ పోటీల్లో మహిళల జట్టుకు స్కిల్ ఎనలైజర్‌గా వ్యవహరించాడు. గతంలో దక్షిణమధ్య రైల్వే జట్టు, భారత రైల్వే జట్టు, అల్టీమేట్ ఖోఖో పోటీల్లో కోచ్‌గా విధులు నిర్వర్తించారు.