
మారథాన్ వీరుడు
మల్యాల(చొప్పదండి): మండలంలోని రామన్నపేటకు చెందిన గుగ్గిలం అశోక్ నిజామాబాద్‌లోని వేల్పూరులో ఆర్టీవో విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ, క్రీడల్లోనూ మెరుస్తున్నాడు. పాఠశాల స్థాయిలోనే క్రీడలపై ఆసక్తితో ప్రాక్టీసు చేస్తూ 100,200,400మీటర్ల విభాగాలతోపాటు కబడ్డీలోనూ ప్రతిభ చూపి, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాడు. మాస్టర్ అథ్లెటిక్స్ ఈవెంట్‌లో రాష్ట్రస్థాయి 5కే రన్‌లో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇంటర్ స్థాయి నుంచి మారథాన్ వైపు మళ్లారు. గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, బెంగళూరు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జమ్ముకశ్వీర్, మధ్యప్రదేశ్‌లో నిర్వ21,42 కిలోమీటర్ల పోటీల్లో రాణించాడు. ఇటీవల ముంబయిలో జాతీయస్థాయి టాటా మారథాన్‌లో ప్రతిభచూపాడు. జాతీయ, అంతర్జాతీయపోటీల్లో రాణిస్తున్న అశోక్ ఇటీవల రెండు రాష్ట్రాల ఉత్తమ క్రీడాకారుడిగా అవార్డు అందుకున్నారు. గతేడాది 10 కి.మీ పరుగు పందానికి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. హిస్టారికల్ రన్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. ఈ ఏడాది కామారెడ్డిలో నిర్వహించిన హాఫ్ మారథాన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు.