
టీ అందించే స్థాయి నుంచి..
ఇల్లంతకుంట(మానకొండూర్): టీ అందించే స్థాయి నుంచి కోచ్‌గా ఎదిగాడు పండుగ ఆనంద్. ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఆనంద్ తల్లిదండ్రులు హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తారు. పాఠశాల స్థాయి నుంచే ఖోఖో పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. 2002 నుంచి 2016 వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించాడు. జాతీయస్థాయిలో 60 టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. సీనియర్ విభాగంలో 7 బంగారు, ఒక సిల్వర్ పతకం సాధించాడు. 2016లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిర్వహించిన మూడవ ఆసియా ఖోఖో చాంపియన్‌షిప్ పోటీల్లో ఇండియా టీంకు కెప్టెన్‌గా వ్యవహరించి బంగారు పతకం సాధించాడు. 18 ఏళ్లకే 2008లో రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం సాధించాడు. 2017 నుంచి ఖేల్ తెలంగాణ సీనియర్ ఖోఖో జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.