
గురి పెడితే పతకమే..
ఎలిగేడు(పెద్దపల్లి): ఇటీవల కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది తానిపర్తి చికిత. ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి శ్రీనివాసరావు–శ్రీలత దంపతుల కుమార్తె చికిత. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 8వ తరగతిలోనే ఆర్చరీపై మక్కువ పెంచుకుంది. 2019 ఇంటి వద్దనే ఆర్చరీ ప్రాక్టీసు మొదలు పెట్టింది. ఎస్‌జీఎఫ్ క్రీడల్లో మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభచాటింది. 2023లో గోవాలో జాతీయ పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. జాతీయస్థాయి సీనియర్, జూనియర్ పోటీల్లో రజత, కాంస్య పతకాలు, చైనాలోని షాంఘైలో జరిగిన టోర్నీలో సిల్వర్ మెడల్ గెలుచుకుంది.