
క్రికెట్‌లో రాణిస్తున్న శ్రీవల్లి
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన శ్రీవల్లి క్రికెట్‌లో రాణిస్తోంది. ఉద్యోగరీత్యా తండ్రి కట్ట లక్ష్మారెడ్డి కరీంనగర్‌లో ఉంటుండగా, తల్లి ఉమారాణి బ్యూటీపార్లర్ నడుపుతుంటారు. పాఠశాల స్థాయి నుంచి శ్రీవల్లికి క్రికెట్ అంటే ఇష్టం. హైదరాబాద్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో మెలకువలు నేర్చుకుంది. జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌లో అండర్– 14 విభాగంలో పాల్గొని ప్రతిభ కనబరిచింది. 2022లో పూణేలో అండర్– 19 విభాగంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఫాస్ట్ బౌలర్‌గా సత్తాచాటింది. క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్‌గా రాణించడమే తన లక్ష్యమని పేర్కొంది.