
కొత్త క్రీడా పాలసీలను అమల్లోకి తేవాలి
కరీంనగర్ స్పోర్ట్స్: క్రీడల అభివృద్ధికి పాటుపడుతున్నామని, జాతీయ, అంతర్జాతీయస్థాయి వేదికల్లో రాణించే క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని.. ఇలా పలు రకాల పథకాలు, ప్రణాళికలతో దేశం, రాష్ట్రంలో క్రీడా రంగం రాతను మార్చేస్తామంటు క్రీడా పాలసీలు రూపొందించారు. ఇటీవలే రెండు పాలసీలు ఆమోదం పొందాయి. త్వరలో అమలుకానున్న నూతన క్రీడా పాలసీలపై క్రీడారంగ ప్రముఖుల అభిప్రాయాలు..
కొత్త క్రీడా పాలసీలో భాగంగా ప్రభుత్వం కొత్త జిల్లాల్లోని క్రీడారంగంపై దృష్టి సారించాలి. కోచ్‌ల నియామకాలు, పోటీలు నిర్వహించడానికి నిధులు విడుదల చేయాలి. ఇప్పటికీ కొత్త జిల్లాల్లో క్రీడా కార్యక్రమాలు అంతంతమాత్రమే జరుగుతున్నాయి. క్రీడా పాలసీలోనైనా కొత్త రూపుదాల్చాలి.
– గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, తెలంగాణ ఒలింపిక్
సంఘం సంయుక్త కార్యదర్శి
క్రీడా పాలసీలో భాగంగా జిల్లాల్లో కోచ్‌ల నియామకం త్వరగా చేపట్టాలి. కోచ్‌లు లేక చాలా వరకు స్టేడియాలు వెలవెల బోతున్నాయి. స్టేడియంలో కోచ్‌లు లేకుంటే ఇక క్రీడాకారుల శిక్షణ తీసుకునేందుకు ఎలా వస్తారు. వెంటనే నియమించాలి.
– సీహెచ్.సంపత్‌రావు,
రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు
ఉన్నత విద్య, పోటీ పరీక్షల్లో అమల్లో ఉన్న క్రీడా కోటాను పెంచాలి. ప్రస్తుతం ఉద్యోగావకాశాల్లో 2 శాతం, ఉన్నత విద్యకు 0.5 శాతం క్రీడా కోటా అమల్లో ఉంది. అలాగే మరిన్ని క్రీడలను చేర్చాలి.
– బి.లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి
కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయాలి. 2005లో ప్రారంభమైన ఈ పాఠశాలలో టెన్త్ వరకే ఉంది. ఆ తర్వాత విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయరవుతోంది. వెంటనే అప్‌గ్రేడ్ చేయాలి.
– టి.రమేశ్‌రెడ్డి, రాష్ట్ర రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడు

కొత్త క్రీడా పాలసీలను అమల్లోకి తేవాలి

కొత్త క్రీడా పాలసీలను అమల్లోకి తేవాలి

కొత్త క్రీడా పాలసీలను అమల్లోకి తేవాలి