Telangana Crime News: Heart Infection: మృత్యువుతో పొరాడి ఓడిన యువకుడు!
Sakshi News home page

Heart Infection: మృత్యువుతో పొరాడి ఓడిన యువకుడు!

Jan 18 2024 12:26 AM | Updated on Jan 18 2024 9:55 AM

- - Sakshi

రాజు (ఫైల్‌)

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గుండె దగ్గర ఇన్‌ఫెక్షన్‌తో ప్రాణా పాయ స్థితిలో ఆస్పత్రిలో చేరి మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన యువకుడు చివరికి ప్రాణాలు వదిలాడు. దాతలు స్పందించి సాయం అందించి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చినప్పటికీ మృత్యువును గెలువలేకపోయాడు. కుటుంబ పెద్ద మృతితో అతనిపై ఆధారపడ్డ భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు.

ఈ సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో బుధవారం విషాదం నింపింది. నారాయణపూర్‌కు చెందిన అనుప రాజు(25) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రాజును కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చూపించగా, గుండె వద్ద ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే వైద్యం చేయించకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలపడంతో ఓ ప్రైవేట్‌ అస్పత్రిలో చేర్పించారు.

చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో రాజు ప్రాణాలు దక్కించుకునేందుకు కుటుంబ సభ్యులు తెలిసిన వ్యక్తుల వద్ద అప్పులు చేసి పెట్టారు. దాదాపు రూ.3లక్షల వరకు వెచ్చించారు. కుటుంబ పరిస్థితి అంతంతే కావడంతో అప్పటికే గ్రామస్తులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించారు. అయినా ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత పెరిగి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు.

రెండు రోజుల్లో రూ.3 లక్షలు ఖర్చుచేసిన ప్రాణాలు దక్కకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి తండ్రి మల్లయ్య, భార్య శీరిష, మూడేళ్ల కూతురు మనుశ్రీ, నాలుగు నెలల కుమారుడు మన్విత్‌ ఉ న్నారు. కడుపేదరికం అనుభవిస్తున్న రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement