
ఖోఖో లో తలపడుతున్న క్రీడాకారిణులు
కరీంనగర్‌స్పోర్ట్స్: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.. లక్ష్య సిద్ధితో చేస్తే దేనినైనా సాధించవచ్చు అన్న నానుడి అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో క్రీడా రంగంలో ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా రాణించడమే కాకుండా పతకాలను సైతం సాధిస్తున్నారు. షట్లర్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధూ, బాక్సర్‌లో నిఖత్ జరీన్, క్రికెట్‌లో మిథాలీరాజ్, రెజల్లింగ్‌లో సాక్షి మాలిక్ లాంటి మన తెలంగాణ క్రీడారత్నాలను స్ఫూర్తిగా తీసుకున్న బాలికలు తాము సైతం క్రీడల్లో అంటూ క్రీడా రంగం వైపు ఆసక్తిని కనబరుస్తుండడం విశేషం. కరీంనగర్‌లోని సెయింట్ జాన్ పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి సీఎస్‌ఏ క్రీడా పోటీలకు పెద్ద సంఖ్యలో బాలికలు హాజరు కావడమే ఇందుకు నిదర్శనం. సుమారు 1800 మంది బాలబాలికలు హాజరు కాగా బాలికలు రెట్టింపు ఉత్సాహంతో పోటాపోటీగా పాల్గొంటున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. పీవీ సింధూ, నిఖత్ జరీన్‌ల స్ఫూర్తితో తాము కూడా క్రీడల్లో రాణించి దేశానికి పతకాలు సాధించి పెట్టి జాతీయ పతాకాన్ని సగౌరవంగా ఎగురవేస్తామంటున్న పలువురు క్రీడాకారిణుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
క్రీడారంగంపై బాలికల మక్కువ
పోటీలకు పెద్ద సంఖ్యలో
హాజరవుతున్న వైనం
తాము సైతం పతకాలు
సాధిస్తామంటున్న క్రీడాకారిణులు