18న ఉద్యమకారుల సదస్సు | Sakshi
Sakshi News home page

18న ఉద్యమకారుల సదస్సు

Published Sun, Nov 12 2023 1:24 AM

-

జగిత్యాలటౌన్‌: పదేళ్ల తెలంగాణ పాలన, అమరుల ఆశయాల సాధనపై జిల్లా కేంద్రంలో ఈనెల 18న ఉద్యమకారుల సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సుకు టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండరాం, ఉద్యమకారులు హాజరవుతారని తెలిపారు. ఉద్యమకారులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, రచయితలు, విద్యావంతులు, మేధావులు, ఉద్యమంలో భాగస్వాములైన ప్రతిఒక్కరూ హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు.

రంగులు వేసినందుకు ద్విచక్ర వాహనం సీజ్‌

రాయికల్‌: మండలంలోని ఇటిక్యాలకు చెందిన ఓ పార్టీ అభిమాని తన ద్విచక్ర వాహనానికి పార్టీకి సంబంధించిన రంగులు వేశాడు. దీంతో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు శనివారం ఆ వాహనాన్ని సీజ్‌ చేసి పోలీస్‌శాఖకు అప్పగించినట్లు ఎస్సై అజయ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement