మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్:దళితబంధు పథకం ఎమ్మెల్యేల బంధుగా మారిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించా రు. గురువారం జగిత్యాలలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దరఖాస్తులు స్వీకరించకుండా దళితబంధు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తున్నారని ప్రశ్నించారు. అర్హుల ఎంపికలో కలెక్టర్, ప్రజాప్రతినిధులు భాగస్వాములుగా ఉంటార ని ప్రభుత్వం విడుదల చేసిన జీవో8లో పేర్కొన్నారని, ఆ ప్రజాప్రతినిధులెవరో చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యేనా..? ఎమ్మెల్సీనా..? ఎంపీనా..? సర్పంచా..? ఎవరో కలెక్టర్ స్పష్టం చేయాలన్నారు. దరఖాస్తులు ఎక్కడ స్వీకరిస్తారు..? అర్హుల ఎంపిక ప్రక్రియ వంటి అంశాలపై కలెక్టర్ ప్రకటన విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రజాప్రతినిధుల జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగమో..? బీఆర్‌ఎస్ రాజ్యాంగమో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన గ్యారెంటీ పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్తామని తెలిపారు. గిరి నాగభూషణం, బండ శంకర్, గాజంగి నందయ్య, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, జున్ను రాజేందర్, ధర రమేశ్, మన్సూర్, మహేందర్‌గౌడ్, రాధాకిషన్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి


