కామారెడ్డి అర్బన్: సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తాయని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, న్యాయమూర్తి నాగరాణి పేర్కొన్నారు. స్వయం కృషి పరస్పర సహాయక సహకార సంఘం ఐదో వార్షిక మహాజన సభ సమావేశం గురువారం అయ్యప్పనగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి జడ్జి నాగరాణి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్డ్ స్వచ్ఛంద సంస్థ సమన్వయకర్త రాణి, ఏఆర్‌టీ వైద్యాధికారి స్నేహ, డీపీఎం సుధాకర్, ప్రతినిధులు అంచల్, శ్రీవాస్తవ, నాగరాజు, లింబాద్రి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
● అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి టౌన్: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పాల్గొనే ఆసక్తి గల రైస్‌మిల్లర్లు నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీ సమర్పించడంతోపాటు ధాన్యం కేటాయింపు ఒప్పందాలను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో గురువారం రైస్‌మిల్లర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు నిర్దేశించిన గడువులోగా సంబంధిత పత్రాలు, ఇతర విధివిధానాలను పూర్తి చేయాలని సూచించారు. కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు మిల్లర్లు జిల్లా యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
కామారెడ్డి టౌన్: మహిళలు ఝాన్సీ రాణి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్రీయ సేవికా సమితి జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీలత సూచించారు. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీసాందీపని కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘సీ్త్ర శక్తి దివస్’ను నిర్వ హించారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన తొలి స్వాతంత్య్ర సమరంలో ఝాన్సీ రాణి చూపిన ధైర్యసాహసాలు నేటి తరానికి ఆదర్శమన్నారు. ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థినులు, మహిళలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలని సూచించారు. వ్యక్తిగత స్వార్థాన్ని వదిలి సమాజం, దేశం, ధర్మం కోసం జీవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా ప్రముఖ్ బీఎన్. గిరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు అనిల్‌రెడ్డి, నాయకులు సాత్విక్, బిందు, వినయ్, అజర్, నిఖిల్, శ్లోక, వైష్ణవి, ప్రణవి పాల్గొన్నారు.
భిక్కనూరు: మండల కేంద్రంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పత్తి పంట సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏవో మోహన్ రెడ్డి పత్తి సాగులో పాటించాల్సిన మెలకువలు, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై వివరించారు. పురుగు మందులు పిచికారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఆత్మ పీడీ మహిత, శాస్త్రవేత్తలు ఉదయ శంకర్, హోనప్పగౌడ, ఏడీఏ అపర్ణ, ఏవో నాగరాజురెడ్డి, ఏఈవోలు రాజేశ్, దీక్షిత్‌రెడ్డి, లత ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: టీజీపీఎస్సీ గ్రూప్–2, గ్రూప్–3 పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎం. శశికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, పార్సీ, బౌద్ధ మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోగా హైదరాబాద్ నాంపల్లిలోని మైనారిటీస్ స్టడీ సర్కిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 040–23236112, 9059050062 నంబర్లలో గానీ, directormscccctelangana @gmail.com ఈ–మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.


