కార్తీక దీపారాధనకు విశేష ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

కార్తీక దీపారాధనకు విశేష ప్రాధాన్యత

Nov 20 2026 1:43 AM | Updated on Nov 20 2026 1:43 AM

● ఆధ్యాత్మిక ప్రవచనకర్త

చాగంటి కోటేశ్వరరావు

కామారెడ్డి అర్బన్‌: కార్తీక మాసంలో చేసే దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. కామారెడ్డి శ్రీఅయ్యప్ప సేవా సమితి, అన్నప్రసాద సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీసరస్వతి విద్యామందిర్‌ హైస్కూల్‌ మైదానంలో గురువారం రెండో రోజూ చాగంటి ప్రవచన కార్యక్రమం కొనసాగింది. రెండో రోజు కార్తీక వైభవం అంశంపై ప్రవచనామృతాన్ని అందించారు. ప్రతి ఇంటా ఉదయం, సాయంత్రం వేళల్లో దీపారాధన చేయాలన్నారు. మహిళలు తులసి కోట వద్ద దీపం వెలిగించడం ఎంతో శుభప్రదమని పేర్కొన్నారు. శివకేశవులిద్దరికీ కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైనదన్నారు. ఈ మాసంలో పరమశివుడికి బిల్వార్చన, అభిషేకం, శ్రీమహావిష్ణువుకు తులసి దళాలతో అర్చన చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం దక్కుతుందన్నారు. మనిషి ప్రకృతిపై ఆధారపడి జీవిస్తున్నందున కృతజ్ఞతగా ప్రకృతిని ఆరాధించాలని సూచించారు. నాగచవితి, పౌర్ణమి, ఆకాశ దీపం, దామోదరలీలలు ప్రాధాన్యతలను వివరించారు. ముగింపు కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి, అన్నప్రసాద సమితి ఆధ్వర్యంలో చాగంటి కోటేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ప్రవచన కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డితోపాటు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement