ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సన్నబియ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సన్నబియ్యం

Nov 20 2026 1:43 AM | Updated on Nov 20 2026 1:43 AM

ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సన్నబియ్యం

భూముల రీసర్వే పరిశీలన

● కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

● బాన్సువాడలో స్పెషల్‌ రైస్‌

కౌంటర్‌ ప్రారంభం

బాన్సువాడ: ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నాణ్యమైన సన్న బియ్యాన్ని విక్రయించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పేర్కొన్నారు. బాన్సువాడలోని తిరుమల రైస్‌మిల్‌ వద్ద ఏర్పాటు చేసిన స్పెషల్‌ రైస్‌ కౌంటర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ ఆదేశాల మేరకు తిరుమల రైస్‌ దుకాణం వద్ద స్పెషల్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించడంతోపాటు సామాన్య ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా ధరల పర్యవేక్షణ చేపడుతూ ప్రత్యేక రైస్‌ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కౌంటర్‌ ద్వారా బహిరంగ మార్కెట్‌ ధరల కన్నా తక్కువ ధరలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని విక్రయిస్తున్నట్లు తెలిపారు. రేషన్‌ కార్డు ఉన్న వారితోపాటు రేషన్‌ కార్డులు లేని అల్పాదాయ వర్గాల ప్రజలు కూడా బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేశారు. రైస్‌ కౌంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన తిరుమల రైస్‌మిల్‌ యజమాని నాగులగామ వెంకన్నను కలెక్టర్‌ అభినందించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ విక్టర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రాజానరేందర్‌గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గంగాధర్‌, వ్యాపారవేత్తలు నాగులగామ నిఖిల్‌, రాజేశ్వర్‌, పాత రాజు తదితరులు ఉన్నారు.

బాన్సువాడ మండలం వాసుదేవ్‌పల్లి శివారులో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పరిశీలించారు. గ్రామంలోని ప్రతీ రైతు, పట్టాదారుడికి సంబంధించిన భూముల హద్దులను క్షేత్రస్థాయిలో కచ్చితంగా గుర్తించి, భూముల విస్తీర్ణం, సరిహద్దులు తదితర వివరాలను సమగ్రంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని కలెక్టర్‌ దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement