తీర్థయాత్రలకు ప్రత్యేక ‘భారత్‌ గౌరవ్‌’ రైళ్లు | - | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రలకు ప్రత్యేక ‘భారత్‌ గౌరవ్‌’ రైళ్లు

Nov 20 2026 1:37 AM | Updated on Nov 20 2026 1:37 AM

డిసెంబర్‌ 5 నుంచి జనవరి 3 వరకు మూడు ప్యాకేజీలు

కామారెడ్డి టౌన్‌: పుణ్యక్షేత్రాల సందర్శన కోసం సికింద్రాబాద్‌ నుంచి మూడు ప్రత్యేక ‘భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌’ రైళ్లను నడపనున్నట్లు ఐఆర్‌సీటీసీ అసిస్టెంట్‌ మేనేజర్‌ పీవీ వెంకటేశ్‌ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. డిసెంబర్‌ 5 నుంచి 14 వరకు సాగే ‘అయోధ్య–కాశీ, బైద్యనాథ్‌ ధామ్‌ యాత్ర’లో (పూరీ, కోణార్క్‌, బైద్యనాథ్‌ ధామ్‌, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌) స్లీపర్‌కు రూ.17 వేలు, 3 ఏసీకి రూ.26,400, 2 ఏసీకి రూ.34,400 టికెట్‌ ధర ఉంటుందన్నారు. డిసెంబర్‌ 17 నుంచి 27 వరకు ‘సప్త జ్యోతిర్లింగ దర్శన్‌ యాత్ర’ (ఉజ్జయిని, ద్వారక, సోమనాథ్‌, భీమశంకర్‌, నాసిక్‌, గ్రీష్ణేశ్వర్‌) రైలు కామారెడ్డి, నిజామాబాద్‌ మీదుగా వెళ్తుందని, దీనికి స్లీపర్‌ రూ.18 వేలు, 3 ఏసీ రూ.27,400, 2 ఏసీ రూ.35,500 ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు. జనవరి 3 నుంచి 11 వరకు ‘దివ్య దక్షిణ యాత్ర’ (తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, చిదంబరం, తంజావూరు)కు స్లీపర్‌ రూ.15,800, 3 ఏసీ రూ.23,200, 2 ఏసీ రూ.29,600 ప్యాకేజీ ఉందన్నారు. హైదరాబాద్‌ నుంచి విమాన ప్యాకేజీలో కశ్మీర్‌కు రూ.41,120, అండమాన్‌కు రూ.67,750, దండకారణ్యం రూ.34,800, ఓరియంటల్‌ ఒడిశా రూ.34,050, దక్షిణ భారత దేవాలయ యాత్ర రూ.41,450, శ్రీలంక రామాయణ యాత్రకు రూ.84,100 ధరలున్నాయని వివరించారు. ప్రయాణికులకు వసతి, భోజనం, టూర్‌ ఎస్కార్ట్‌, బీమా సదుపాయం ఉచితమని, దేశీయ విమాన, రైలు ప్యాకేజీలకు ఎల్‌టీసీ వర్తిస్తుందన్నారు. వివరాలకు 9701360701, 9281030744 నంబర్లలో గానీ, www.irctctourism.com వెబ్‌సైట్‌లో గానీ సంప్రదించాలని కోరారు. అనంతరం రైల్వే అధికారులతో కలిసి యాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement