లింగంపేట : మండల కేంద్రంలో నిర్మిస్తున్న శ్రీసరస్వతీ శిశు మందిర్ పాఠశాలకు లింగంపేటకు చెందిన కడారి సదాశివుడు(శ్రీనివాస్) దంపతులు గురువారం రూ. లక్ష విరాళం అందజేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలను అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న ప్రబంధకారిణి కమిటీ సభ్యులు, ఆచార్య బృందాన్ని అభినందించారు. అనంతరం దంపతులను పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు, ఆచార్య బృందం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు కొత్త దుర్గయ్య, ఉపాధ్యక్షుడు లక్ష్మినారాయణ, కోశాధికారి చంద్రయ్య, ప్రధాన మాతాజి సుమలత, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.


