నస్రుల్లాబాద్ : సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సాయికృష్ణ అన్నారు. అపరిచితులకు ఓటీపీ, బ్యాంకుల వివరాలు తెలుపొద్దన్నారు. గ్రామాన్ని డ్రగ్స్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పిని సరిగా హెల్మెట్ ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని,మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. సర్పంచ్ సాయిలు, గ్రామస్తులు రాజిరెడ్డి,రెడ్డి శ్రీను,విఠల్,గంగారాం, వెంకన్న,పవన్ తదితరులు పాల్గొన్నారు.


