ఎల్లారెడ్డిరూరల్:ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శ్రావణి, సా హిత్యలకు సర్పంచ్ సాయిలు గురువారం రూ. 2వే ల నగదును అందజేశారు. కామారెడ్డిలో నిర్వహించిన జిల్లా స్థాయి రగ్బీ పోటీలలో గెలుపొందిన శ్రా వణి, సాహిత్యలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కా వడంతో వారికి రవాణా ఖర్చుల నిమిత్తం ఈనగ దును అందించారు. ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు వెంకట్,అరుణ,నరేష్ ఉన్నారు.
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని 39వ వార్డు వివేకానంద కాలనీ పార్క్ ఏరియాలో సీసీ రోడ్డు ని ర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ..మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. వార్డు కౌన్సిలర్ మో టూరి శ్రీఆకంత్, కాలనీవాసులు కొండ అశోక్, నాగెల్లి శ్రీనివాస్, సూర్యనారాయణ, శ్రీహరి, కాంట్రాక్టర్ గూడెం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లాలోని అన్ని గ్రామాల్లో ముదిరాజ్ జెండాను ఎగురవేస్తామని జిల్లా అధ్యక్షుడు జి.భిక్షపతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.రాజేశ్వర్‌లు తెలిపారు. ముదిరాజ్‌లు ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


