నాగిరెడ్డిపేట: మండలంలోని చీనూర్‌లో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై అగస్త్య భార్గవ్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండ ప్రమీల ఈ నెల 17న ఇంటికి తాళం వేసి మెదక్‌లోని తన బంధువుల వద్దకు వెళ్లింది. గురువారం వచ్చి చూడగా తన ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో ఉన్న 5గ్రాముల బంగారు ఉంగరం, 3 గ్రాముల బంగారు చెవిరింగులు, 13 గ్రాముల బంగారు గుండ్లు చోరీకి గురయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


