బాన్సువాడ: బీర్కూర్ మండలం కల్లు దుకాణ యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఈగల్ ఫోర్స్ అధికారి పూర్ణేశ్వర్ తెలిపారు. నిజామాబాద్ ఈగల్, బీర్కూర్ పోలీసుల ఆధ్వర్యంలో కల్లు దుకాణంలో దాడి చేయగా కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు తేలడంతో దుకాణ యజమాని పండరిగౌడ్‌పై కేసు నమోదు చేసి, కల్లు సీసాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మరో ఇద్దరితో సంబంధం ఉన్నట్లు తేలిందని, త్వరలో వారిని కూడా పట్టుకుంటామని అన్నారు.
పెద్దకొడప్‌గల్: మండలంలోని కాటేపల్లి తండాలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న ఏడుగురిని పట్టుకొని వారి నుంచి రూ.25 వేల నగదు, ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.
అన్నాసాగర్‌లో..
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న 8 మందిని పట్టుకొని వారి నుంచి రూ. 24 వేల నగదు, 6 ఫోన్లు, నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
భిక్కనూరు: సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని ఎస్సై అనిల్ అన్నారు. బుధవారం భిక్కనూరు మండలం భాగిర్తిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పది సీసీ కెమెరాలను ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటు సహకరించిన ప్రజలకు అభినందనలు తెలిపారు.


