కామారెడ్డి టౌన్/కామారెడ్డి అర్బన్ : ప్రతి ఒక్కరూ దేశంలోని చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి. నాగరాణి తెలిపారు. న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణ, మహిళా, బాల్య వివాహాల నిషేధం, పోక్సో–2012 చట్టాలపై అవగాహన కల్పించారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజు, కళాశాల ప్రిన్సిపాల్ ప్రణీత, డీఎల్‌ఎస్‌ఏ జూనియర్ అసిస్టెంట్ సమి ఉల్లా ఖాన్, ఉన్నారు.


