● ఇద్దరు దుర్మరణం
మోపాల్: మండలంలోని కంజర్ శివారులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కోటగల్లికి చెందిన అల్లెపు మనోజ్ (48), కోలం రాజు (36) బైక్‌పై కంజర్‌కు వ్యక్తిగత పని నిమిత్తం వచ్చారు. పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా గ్రామ శివారులో గడ్డి తీసుకొని ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టారు. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని ఎస్సై సుస్మిత పరిశీలించి పంచనామా నిర్వహించారు. మనోజ్ మెడికల్ రిప్రజెంటివ్‌గా, రాజు డ్రైవర్ గా పని చేస్తున్నారు. మనోజ్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, రాజుకు భార్య, నెల రోజుల బాబు ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుస్మిత తెలిపారు.


