మెరుగైన వైద్య సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవలు అందించాలి

Nov 12 2026 12:37 AM | Updated on Nov 12 2026 12:37 AM

● జాతీయ ఆరోగ్య కార్యక్రమాల

లక్ష్యాలను అధిగమించాలి

● వైద్యాధికారుల సమీక్షలో

డీఎంహెచ్‌వో జె. వెంకట్‌

కామారెడ్డి టౌన్‌ : జిల్లాలో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో) జె. వెంకట్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని జిల్లా కార్యాలయంలో పీహెచ్‌సీల వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. గర్భిణుల ముందస్తు నమోదు నుంచి ప్రసవానంతర సంరక్షణ వరకు వైద్య సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా హైరిస్క్‌ గర్భిణులను ప్రాథమిక దశలోనే గుర్తించి, ప్రత్యేక లిస్టు ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రసవం కోసం ముందస్తుగానే జనన సన్నద్ధత ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. మాత,శిశువుల మరణాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. ఏదైనా మాతృ మరణం సంభవిస్తే తక్షణమే ఎండీఎస్‌ఆర్‌ మార్గదర్శకాల ప్రకారం కారణాలను విశ్లేషించి, భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సార్వత్రిక టీకాల కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ సమయానికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని, డ్రాపౌట్లను గుర్తించి మాప్‌–అప్‌ డ్రైవ్‌ చేపట్టాలని ఆదేశించారు. టీబీ, కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించడంతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ వంటి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్‌ నిర్వహించి పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో పీహెచ్‌సీల వైద్యాధికారులు, పర్యవేక్షకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement