సీపీఎస్‌ రద్దు కోసం 17న సామూహిక సెలవులు | - | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దు కోసం 17న సామూహిక సెలవులు

Nov 12 2026 12:37 AM | Updated on Nov 12 2026 12:37 AM

సీపీఎస్‌ రద్దు కోసం 17న సామూహిక సెలవులు కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె 418 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం

కామారెడ్డి టౌన్‌ : సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 17న ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామూహిక సెలవులు పెట్టి పోరాట బాట పట్టాలని టీఎస్‌సీపీఎస్‌ఈయూ జిల్లా అధ్యక్షుడు కుంట ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్‌ భావే పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను కలిసి 17న చేపట్టనున్న కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ ధర్మదీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2023 నవంబర్‌ 17న విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం కొలువుదీరి మూడేళ్లు గడుస్తున్నా ఆ హామీని నెరవేర్చకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి చల్ల సునీల్‌, నాయకులు సృజన్‌, మక్బూల్‌, రమేష్‌, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌ : డిమాండ్లను పరిశీలించాలని కోరుతూ ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. బుధవారం 30వ రోజు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌ సమ్మె శిబిరంలో ఉద్యోగులు అడుగుల చిత్రాలు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. సమ్మెలో వైద్యులు, ఉద్యోగులు, నాయకులు వేణుమాధవ్‌, రా హుల్‌, మారుతి, హరీష్‌, వెంకటరమ ణ, పద్మజ, అశ్విని, రాజు, కళ్యాణ్‌, అంకుశ్‌, గీత, రవితేజ, అఖిల్‌, హిమబిందు, అరుణ, జయశ్రీ, నిర్మల, రాశి, శిరీష తదితరులున్నారు.

కామారెడ్డి టౌన్‌ : వానకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో 418 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్‌ విక్టర్‌, పౌర సరఫరాల శాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేడ్‌–ఎ రకం క్వింటాల్‌కు రూ. 2,461, సాధారణ రకానికి రూ. 2,441 మద్దతు ధరతోపాటు అర్హులైన రైతులకు సన్నరకాల బోనస్‌ నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే వ్యాపారులు, మిల్లర్లపై ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌ కింద చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో బియ్యం గరిష్ట విక్రయ ధరలను ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు. కిలో సన్నబియ్యం గరిష్ట ధర రూ. 66, ఆర్‌ఎన్‌ఆర్‌/తెలంగాణ సోన రూ.74, హెచ్‌ఎంటీ/జేఎస్సార్‌ ధర రూ. 79 గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఎక్కువ ధరకు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే తక్కువ తూకం వేస్తున్న నలుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలు, బియ్యం అధిక ధరలపై టోల్‌ ఫ్రీ నంబర్‌ 08468–220051కు సమాచారం అందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement