పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించాలి

Nov 12 2026 12:37 AM | Updated on Nov 12 2026 12:37 AM

● జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌

చంద్రశేఖర్‌గౌడ్‌

నిజామాబాద్‌ అర్బన్‌: పెండింగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదాయ వసూళ్ల ప్రత్యే క ఎన్ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌పై జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌ అన్నారు. జిల్లా రవా ణాశాఖ కార్యాలయంలో బుధవారం నిజామాబా ద్‌, కామారెడ్డి జిల్లాల సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌గౌడ్‌ కౌంటర్‌ లు, క్లర్క్‌లవారీగా నిర్వహిస్తున్న లావాదేవీలను పరిశీలించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనాల ఫిట్‌నె స్‌, రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ విభాగాల పనితీరును సమీక్షించారు. వాహన్‌ సారథి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సమీక్షించి వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ఆదాయ లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. అనధికార వ్యక్తులు కార్యాలయంలో ఉండకుండా చూడాలన్నారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. జిల్లా ఉప రవాణా కమిషనర్‌ దుర్గాప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి రమేశ్‌రాథోడ్‌, టి సంతోష్‌ కుమార్‌, కామారెడ్డి ఆర్టీవో ప్రహ్లాద్‌ అశ్వంత్‌ కుమార్‌, రాహుల్‌, ప్రదీప్‌, రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement