కామారెడ్డి టౌన్: మండలంలోని టేకిర్యాల్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, దేవునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రేషన్ బియ్యాన్ని ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. వాహనంలో ఉన్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని అక్రమ రవాణాకు పాల్పడిన మహారాష్ట్రలోని నాందేడ్‌కు అషద్ ఖాన్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
టేకిర్యాల్ శివారులో..
కామారెడ్డి టౌన్: మండలంలోని టేకిర్యాల్ శివారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ ఎర్రం కిష్టయ్య బుధవారం పట్టుకున్నారు. ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు దాడి చేసి పట్టుకున్నారు. వాహనంలో ఉన్న సుమారు 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని అక్రమ రవాణాకు పాల్పడుతున్న సదాశివనగర్‌కు చెందిన నర్మల నర్సయ్యపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
నవీపేటలో ..
నవీపేట: మండల కేంద్రంలో బుధవారం అక్రమంగా తరలిస్తున్న 38 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ పవన్ కుమార్ తెలిపారు. నవీపేట నుంచి ధర్మాబాద్ వైపు బొలేరో వాహనంలో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం రావడంతో బాసర క్రాసింగ్ దగ్గర వాహనాన్ని పట్టుకున్నామన్నారు. 38 క్వింటాళ్ల బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.


