ఘనంగా భావూబీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా భావూబీజ్‌

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

ఘనంగా భావూబీజ్‌ పెండింగ్‌ పనులను వేగంగా పూర్తి చేయాలి పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి

మద్నూర్‌(జుక్కల్‌): మద్నూర్‌ మండలం మ హారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో అక్కడి సాంప్రదాయం ప్రకారం ప్రజలు ఐదు రోజులపా టు లక్ష్మి పూజలు కొనసాగిస్తారు. ఇందులో భా గంగా మంగళవారం భావూబీజ్‌ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా సో దరీమణులు తమ సోదరులకు తిలకం పెట్టి, హారతి ఇచ్చి, తీపి వంటకాలు తినిపించారు. అనంతరం సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు అందించారు.

నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డి: గ్రామాల్లో పంచాయతీరాజ్‌శాఖ పెండింగ్‌ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహాన్‌రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మంగళవా రం పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో ఆయ న సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు దక్కించుకొని ఇప్పటివరకు ప్రారంభించని కాంట్రాక్టర్లపై కఠినచ ర్యలు తీసుకోవాలని, నిబంధనల ప్రకారం వా రి ఒప్పందాలను రద్దుచేసి, పనులు చేపట్టేందు కు ఆసక్తి ఉన్నవారికి అప్పగించేలా చర్యలు చే పట్టాలన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాల ను త్వరితగతిన అందించడమే లక్ష్యంగా అధికారులు పూర్తిబాధ్యతతో పనిచేయాలని, ప్రతి పనిపై నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌ ఈఈ దుర్గాప్రసాద్‌, డీఈఈ నర్సింహా, ఏఈలు పిచ్చయ్య, సందీప్‌, శరత్‌, కల్పన, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు సహకరించాలి..

ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధి పనులకు సహకరించాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పబ్లిక్‌ హెల్త్‌ మున్సిపల్‌ ఈఎన్‌సీ సాయప్ప రెడ్డిని కో రారు. హైదరాబాద్‌లో మంగళవారం సాయప్పరెడ్డితో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. పట్ట ణ సుందరీకరణ, పారిశుద్ధ్యం, డ్రెయినేజీ వ్యవస్థ, తదితర అంశాలపై చర్చించారు.

రామారెడ్డి (ఎల్లారెడ్డి): పెండింగ్‌ కేసులను త్వ రితగతిన పరిష్కరించాలని, పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించిన బాధితుల సమస్యలను పరిష్క రించి న్యాయం అందించాలని డీఎస్పీ మధుసూదన్‌ అన్నారు. రామారెడ్డి పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తులో నాణ్యత, పూర్తి పారదర్శకత పాటించాల ని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారు ల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎల్లప్పుడూ అ ప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి స్పష్టం చేశా రు. కామారెడ్డి రూరల్‌ సీఐ శ్రీధర్‌గౌడ్‌, రామా రెడ్డి ఎస్సై మురళి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement