యువకుడి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

● మృతుడు బిహార్‌వాసి

● కాలూర్‌ శివారులో ఘటన

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కాలూర్‌ శివారులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రం హర్యానా జిల్లా సల్గోడికచా గ్రామానికి చెందిన క్రిష్‌ కుమార్‌(19) స్థానిక క్లాసిక్‌ పేపర్‌ మిల్లులో లేబర్‌గా పనిచేస్తున్నాడు. మిల్లుకు సమీపంలోనే నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్రిష్‌కుమార్‌ను తీసుకెళ్లి బీరు సీసాతో కడుపు, మెడ, ఛాతి భాగాల్లో పొడిచి హత్య చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. మృతుడి తండ్రి సికిందర్‌ సదా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆవు మృతి కలకలం

లింగంపేట (ఎల్లారెడ్డి ): మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఆవు మృతి కలకలం రేపింది. ఎస్సై దీపక్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లమడుగు తండాకు చెందిన ధనవత్‌ రమేశ్‌ ఆవును మొక్కు కారణంగా ఊరిలో వదిలేశారు. ఆవు సోమవారం పంట పొలాల్లో వడ్లు తిని ఊపిరి ఆడక మృతి మరణించింది. ఈ విషయం తెలుసుకున్న యజమాని లింగంపేటకు చేరుకొని తన ఆవును గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సై, వెటర్నరీ వైద్యురాలు జోన హన్నాస్‌ ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ఆవు కడుపులో వడ్లు ఉండటంతో ఎవరు ఆవుపై దాడి చేయలేదని నిర్ధారించారు.

మొక్కజొన్న కుప్ప దగ్ధం

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): మండలంలోని విఠల్‌వాడి తండా శివారులో మొక్కజొన్న కుప్ప దగ్ధమైంది. బాధిత రైతు జాదవ్‌ రాందేవ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండా శివారులో 7 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్నను కోసి ఒకే దగ్గర కుప్పగా పోశారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో సుమారు 250 క్వింటాళ్ల మొక్కజొన్న దగ్ధమైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement