పిట్లం(జుక్కల్): ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఏఈవో కావేరి సూచించారు. మండలంలోని బండపల్లి గ్రామంలో మంగళవారం రైతులకు ఆమె అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా కావేరి మాట్లాడుతూ.. ఒక ఎకరా వరి సాగుకు వినియోగించే నీటితో రెండు నుంచి మూడు ఎకరాల ఆరుతడి పంటలు పండించవచ్చన్నారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని అవగాహన కల్పించారు. సర్పంచ్ శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి, రైతులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎల్నినో పరిస్థితుల కారణంగా యాసంగి సీజన్లో రైతులు ఆరుతడి పంటలుగాని, కూరగాయ సాగు కాని చేపట్టాలని ఏఈవోలు ప్రశాంత్, రజిత సూచించారు. మండలంలోని గోలిలింగాల వడ్లమార్కెట్లో మంగళవారం రైతులకు వారు అవగాహన కల్పించారు. వానాకాలంలో సాగుచేసిన వరిపంట అవశేషాలను కాల్చివేయకుండా నేలలోనే కుళ్లిపోయేలా చేసుకోవాలని తెలిపారు.


