ఎమ్మెల్యేకు సమ్మె నోటీస్‌ అందజేత | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేకు సమ్మె నోటీస్‌ అందజేత

Nov 11 2026 12:49 AM | Updated on Nov 11 2026 12:49 AM

ఎమ్మెల్యేకు సమ్మె నోటీస్‌ అందజేత ‘నీటి యాజమాన్యానికి ప్రాధాన్యత ఇవ్వండి’ పోలీస్‌ క్రీడా పోటీల్లో జిల్లా పోలీసుల ప్రతిభ యూఏఈలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి టౌన్‌: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆశాకార్యకర్తలు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కలిసి డిసెంబర్‌ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే నిరవధిక సమ్మెకు సంబంధించిన నోటీస్‌ అందించారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఆశాకార్యకర్తలకు రూ. 18 వేల కనీస వేతనం అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు ఇందిర, కార్యదర్శి రాజశ్రీ, కోశాధికారి మమత, ఉపాధ్యక్షులు ప్రమీల, లలిత, నాయకులు గంగమణి, లత, రమ, భాగ్య, సుజాత, వనిత, మంజుల, వరలక్ష్మి, లావణ్య, గీత, లక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

మద్నూర్‌: ఎల్‌నినోను దృష్టిలో పెట్టుకొని ఆయిల్‌ ఫామ్‌ సాగులో జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి యాజమాన్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి రైతులకు సూచించారు. చిన్న ఎక్లార శివారులోని ఆయిల్‌ ఫామ్‌ తోటను ఆమె మంగళవారం పరిశీలించారు. అనంతరం గ్రామంలో ప్రత్యేక రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించి రైతులకు పంటల సాగులో పలు సూచనలు ఇచ్చారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మాధవ్‌రావు, హెచ్యూఎల్‌ జనరల్‌ మేనేజర్‌ జగదీశ్‌ చంద్రబాబు, వ్యవసాయ అధికారి రాజు, ఉద్యాన అధికారులు, రైతులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రీడా పోటీలలో జిల్లా పోలీసు సిబ్బంది ప్రతిభ చాటారు. బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భిక్కనూరు పీఎస్‌కు చెందిన బి.లక్ష్మి స్వర్ణం, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో డీఏఆర్‌కు చెందిన ఎల్‌.బాబాగౌడ్‌, బి.లక్ష్మి జోడీ కాంస్యం సాధించారు. ఖోఖోలో బీర్కూర్‌ పీఎస్‌కు చెందిన డి.బుజ్జి కాంస్య పతకం, హ్యాండ్‌బాల్‌లో డీఏఆర్‌కు చెందిన ఎం.రేఖ, జి.శోభ, పిట్లం పీఎస్‌కు చెందిన కె.ప్రియాంక, బీర్కూర్‌ పీఎస్‌కు చెందిన బి.సవితారాణి, పెద్దకొడప్‌గల్‌ పీఎస్‌కు చెందిన వాసవి కాంస్య పతకాలు గెలుచుకున్నారు. వీరిని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్‌ చంద్ర అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు గటుమాల్‌, ఉదయభాస్కర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌, ఆర్‌ఐలు సంతోష్‌ కుమార్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని నిర్మాణ రంగంలో ఉద్యోగావకాశాల కోసం అర్హులైనవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్‌కుమార్‌, తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌) ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 22 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న వారికి ఉచిత విమాన టికెట్‌, వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 080 35524946 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని, www.tomcom. telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు 040–23342040 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement