నోటీసులూ బేఖాతరు! | - | Sakshi
Sakshi News home page

నోటీసులూ బేఖాతరు!

Nov 11 2026 12:49 AM | Updated on Nov 11 2026 12:49 AM

నోటీసులూ బేఖాతరు!

ఈసారైనా స్పందించేనా?

తప్పనిసరిగా నమోదు చేయాలి

కామారెడ్డి టౌన్‌: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినా యాజమాన్యాల తీరు మారడం లేదు. పోర్టల్‌లో తరగతుల వారీగా ట్యూషన్‌ ఫీజు, ఇతర రుసుముల వివరాలను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాలన్న నిబంధనను సైతం బేఖాతరు చేస్తున్నాయి. ఈ విషయమై గతనెల 2వ తేదీన ‘ఫీజుల వివరాలేవీ?’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన విద్యాశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. యాజమాన్యాలు వాటిని లైట్‌ తీసుకున్నాయి.

నమోదు చేసినవి నామమాత్రం..

జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలలు 183 ఉన్నాయి. గతంలో 3 పాఠశాలలు మాత్రమే పోర్టల్‌లో వివరాలు నమోదు చేశాయి. ఈ విషయమై ‘సాక్షి’ ప్రచురితమైన కథనంలో డీఈవో నోటీసులు జారీ చేయగా.. మరో ఐదు స్కూళ్లు మాత్రమే స్పందించి వివరాలను పొందుపరిచాయి. ఇంకా 175 పాఠశాలలు వివరాలు నమోదు చేయాల్సి ఉంది.

అడ్డగోలుగా ఫీజుల వసూళ్లు..

ప్రైవేట్‌ పాఠశాలలు విద్యార్థులనుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్లలో ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ. 40 వేల నుంచి రూ. లక్షకుపైగా ఫీజులు దండుకుంటున్నాయి. ఫీజుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేస్తే డొనేషన్లు, పుస్తకాలు, యూనిఫాంల వ్యాపారం బట్టబయలవుతుందన్న భయంతోనే యాజమాన్యాలు వెనకడుగు వేస్తున్నాయన్న విమర్శలున్నాయి.

గడువు ముగిసినా, నోటీసులు ఇచ్చినా లెక్కచేయని ప్రైవేటు పాఠశాలల తీరుపై జిల్లా విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలు సమర్పించని మిగతా పాఠశాలలన్నింటికీ తాజాగా మరోసారి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. గడువులోగా వివరాలు నమోదు చేయకపోతే పాఠశాలల గుర్తింపు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఫీజుల వివరాల నమోదుకు

ప్రైవేట్‌ స్కూళ్లు ససేమిరా

జిల్లాలోని 183 పాఠశాలలు..

పోర్టల్‌లో నమోదు చేసినవి 8 మాత్రమే

తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ప్రైవేట్‌ పాఠశాల తప్పనిసరిగా విద్యాశాఖ పోర్టల్‌లో ఫీజుల వివరాలను నమోదు చేయాలి. ఇప్పటికే పలుమార్లు ఆదేశాలు జారీ చేశాం. కొన్ని యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో తాజాగా షోకాజ్‌ నోటీసులిచ్చాం. నిర్దేశిత గడువులోగా వివరాలు అప్‌లోడ్‌ చేయని పాఠశాలలపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. – మల్లికార్జున్‌, డీఈవో, కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement