బ్రిడ్జిపై మొరాయించిన బస్సు | - | Sakshi
Sakshi News home page

బ్రిడ్జిపై మొరాయించిన బస్సు

Nov 11 2026 12:49 AM | Updated on Nov 11 2026 12:49 AM

● అరగంట పాటు స్తంభించిన ట్రాఫిక్‌

కామారెడ్డి టౌన్‌: జిల్లాకేంద్రంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపై ఆర్టీసీ బస్సు మొరాయించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రంలోని పాత, కొత్త పట్టణాలను కలిపే ప్రధాన రైల్వే బ్రిడ్జిపై మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు హఠాత్తుగా ఆగిపోయింది. పట్టణానికి ఇరువైపులా రాకపోకలు సాగించేందుకు ఇదే ఏకై క కీలక మార్గం కావడంతో క్షణాల్లోనే ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సుమారు అరగంట పాటు రాకపోకలు స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. చివరకు వాహనదారులు, స్థానికులు కలిసి బస్సును వెనుక నుంచి తోసుకుంటూ బ్రిడ్జి కిందికి దించడంతో ట్రాఫిక్‌ సమస్య తొలగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement